manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:33 am Editor : Editor Vishal Kumar

ఏడాదిగా తిరుగుతున్నా ‘ఇందిరమ్మ ఇల్లు’ రాలేదు

ఏడాదిగా తిరుగుతున్నా ‘ఇందిరమ్మ ఇల్లు’ రాలేదు: తాంసి ఎంపీడీవో ఆఫీస్ ముందు బాధితురాలి నిరసన
మన భారత్, సెప్టెంబర్18, తాంసి:
“కలెక్టరేట్ చుట్టూ, అధికారుల చుట్టూ ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. వర్షాకాలంలో ఇల్లు లేక, అనారోగ్యంతో ఉన్న భర్తను కాపాడుకోలేక నరకం చూస్తున్నాను” అంటూ తాంసి మండల కేంద్రానికి చెందిన రామగిరి అరుణ అనే పేద మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆమె స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయం ముందు ఒంటరిగా నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా బాధితురాలు రాధ మాట్లాడుతూ… గత ఏడాది కాలంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. పోయిన సంవత్సరం గ్రామ పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) స్వయంగా తమ ఇంటికి వచ్చి, సర్వే చేసి, ఫొటోలు కూడా తీసుకువెళ్లారని గుర్తు చేశారు. తీరా ఇటీవల విడుదల చేసిన లబ్ధిదారుల జాబితా చూస్తే తన పేరు ఎక్కడా లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నడుస్తున్న వర్షాకాలంలో ఇల్లు పూర్తిగా కురుస్తూ, ఉండటానికి నీడ లేక నరకయాతన అనుభవించామని ఆమె పేర్కొన్నారు. దీనికి తోడు తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని, కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణమే తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను చేతులు జోడించి వేడుకున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.