manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:24 am Editor : Editor Vishal Kumar

పాఠశాల విద్యార్థులకు ‘స్పోర్ట్స్ డ్రెస్సులు’ పంపిణీ

ఖోడద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘స్పోర్ట్స్ డ్రెస్సులు’ పంపిణీ: సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి ఉదారత
మన భారత్, సెప్టెంబర్18, తలమడుగు:
విద్యార్థుల శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తలమడుగు మండలంలోని ఖోడద్ స్థానిక సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఖోడద్ గ్రామ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆమె తన సొంత ఖర్చులతో సుమారు రూ. 35 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు డ్రెస్సులను అందజేశారు. క్రీడల్లో విద్యార్థులు రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. కేవలం క్రీడా దుస్తులే కాకుండా, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, వారికి ప్రతిరోజూ పౌష్టికాహారంగా ‘రాగిజావ’ అందించేందుకు గాను మరో రూ. 10 వేల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విరాళంగా అందజేశారు.
గ్రామ ప్రథమ పౌరురాలిగా ఉంటూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి సర్పంచ్ ఎముల ప్రియాంక లక్ష్మారెడ్డి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు ఎంతగానో కొనియాడారు. విద్యార్థుల కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా చేపట్టాలని వారు కోరుతూ, సర్పంచ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.