అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని నిరసన
మన భారత్, సెప్టెంబర్18, తాంసి:
తాంసి మండల కేంద్రంలోని నిజమైన, అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలని బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కృష్ణ రత్నా ప్రకాష్ డిమాండ్ చేశారు. తాంసి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితులతో కలిసి శుక్రవారం స్థానిక ఎంపీడీవో (MPDO) కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఇటీవల ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్నవారికి, అనర్హులకే ఈ ఇళ్లను కేటాయించారని ఆయన మండిపడ్డారు. గుడిసెల్లో, అద్దె ఇళ్లలో ఉంటూ నిజంగా ఇళ్లు లేని పేదలను కాదని, రాజకీయ రంగు పూసి అనర్హులకు జాబితాలో చోటు కల్పించడం దుర్మార్గమన్నారు.
ఈ అక్రమాలపై ఎంపీడీవో వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అనర్హుల పేర్లను తొలగించి, నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఇక్కడితో అధికారులు స్పందించకపోతే, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, అర్హులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు.అనంతరం ఎంపీడీవో మెమొరడం అందజేశారు
ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల బాధితులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామస్తులు, యువకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
