రాథోడ్ బాపురావును మర్యాదపూర్వకంగా కలిసిన వేణు
పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చర్చ ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ వేణు యాదవ్.. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీలో ఉన్న పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం...