manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 8:05 pm Editor : manabharath

రాథోడ్ బాపురావును మర్యాదపూర్వకంగా కలిసిన వేణు

పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చర్చ

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ వేణు యాదవ్.. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టైలర్స్ కాలనీలో ఉన్న పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులు పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

అనంతరం వేణు యాదవ్ రాథోడ్ బాపురావును శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. రాథోడ్ బాపురావు సైతం వేణు యాదవ్‌ను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలతో సంబంధాలను మరింత పెంచుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.