manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 2:49 pm Editor : manabharath

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..

 

మన భారత్, తలమడుగు: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

ప్రజాపాలన దినోత్సవం ప్రాధాన్యతను వివరిస్తూ అధికారులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాల ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత చేరువయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ రాజ్మోహన్, ఎంపీడీవో శంకర్, ఏపీఎం శేఖర్, ఏవో ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ చంటి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.