manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 11:42 pm Editor : manabharath

ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి.. షబ్బీర్ అలీకి ఘన సన్మానం

మన భారత్, సెప్టెంబర్17, ఆదిలాబాద్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించారు.

అనంతరం కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలపై ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జేసీ సంధ్యారాణి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్, డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను స్మరించుకున్నారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.