కేక్ కట్ చేసి శుభాకాంక్షలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
చిట్యాల, సెప్టెంబర్ 17 (మన భారత్): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు అరటి పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే లక్ష్యంతో ప్రజలు, ప్రభుత్వాలు సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ప్రధాని జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుదగాని శ్రీనివాస్, సీనియర్ జిల్లా నాయకులు తీగల జగ్గయ్య, గుండా సురేష్, మండల ఉపాధ్యక్షులు నల్ల శ్రీనివాస్ రెడ్డి, చిన్నమనేని సంపత్, మండల సీనియర్ నాయకులు గజనాల రవీందర్, రాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మీ శీలపాక రాజు, మన భారత్, జర్నలిస్టు చిట్యాల ..
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
