manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 8:11 pm Editor : Editor Vishal Kumar

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలు..

పోలీస్‌స్టేషన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్‌ఐ ముప్పు సురేష్

మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 17 (మన భారత్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల పోలీస్‌స్టేషన్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి ఎస్‌ఐ ముప్పు సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని అన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే మండలంలో మరింత ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పవచ్చని అన్నారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పైక్లిక్ చేయండి .