manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 7:02 am Editor : Editor Vishal Kumar

సొంత ఖర్చులతో రహదారి మరమ్మతులు

సొంత ఖర్చులతో రహదారి మరమ్మతులు

ప్రజల ఇబ్బందులను గుర్తించి స్పందించిన ఎస్‌ఐ ముప్పు సురేష్

మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 16 (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి చిన్నవాగు బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఊరట లభించింది. రహదారి దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన మొగుళ్లపల్లి ఎస్‌ఐ ముప్పు సురేష్ ప్రజల సౌకర్యార్థం తక్షణమే స్పందించారు.

తన సొంత ఖర్చులతో బ్లేడ్ ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి బ్రిడ్జిపై రహదారి మరమ్మతులు చేపించారు. గుంతలను పూడ్చి రహదారిని వాహనాల రాకపోకలకు అనుకూలంగా మార్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ముల్కలపల్లి, పరిసర గ్రామాల ప్రజలు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలపై అధికారులు, పోలీసులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంత ఖర్చుతో రహదారి మరమ్మతులు చేపట్టిన ఎస్‌ఐ ముప్పు సురేష్‌ను మండల ప్రజలు అభినందించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.