manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:44 am Editor : manabharath

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రానికి పాలాభిషేకం..

గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోకు మూడేళ్లు.. కేసీఆర్‌కు పాలాభిషేకం

మన భారత్, సెప్టెంబర్17, తాంసి: బోథ్ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారి ఆదేశాల మేరకు తాంసి మండలం జామిడి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు, గిరిజనులు కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

గిరిజనుల రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తమ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొంటూ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ, పాలాభిషేకం నిర్వహించారు.

బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం, వారి హక్కులు, అభివృద్ధి కోసం గతంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేశారు. రిజర్వేషన్ల పెంపు జీవో అమలులోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జామిడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్, ఉపసర్పంచ్ మెస్రం గణేష్‌తో పాటు నాయకులు వినోద్ రెడ్డి, హరిప్రసాద్, గణేష్, సురేష్, రమేష్, నగేష్, శోదన్, ఆసిమ్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.