manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:26 am Editor : manabharath

అధిక శబ్దంతో డీజేలు.. మూడు డీజేలు స్వాధీనం

అధిక శబ్దంతో డీజేలు.. మూడు డీజేలు స్వాధీనం

డీజే యజమానులపై కేసులు నమోదు – గణపతి నిమజ్జనానికి డీజేలకు అనుమతి లేదని ఎస్సై స్పష్టం

మన భారత్, సెప్టెంబర్16, ఆదిలాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసిన వారిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. లాండ సాంగ్వి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మూడు డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం లాండ సాంగ్వి గ్రామంలో అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మూడు డీజేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి డీజే యజమానులు బొట్టు సంతోష్, సాయి చరణ్, షేక్ అమీర్‌లపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలకు అనుమతి లేదు

గణపతి నవరాత్రి ఉత్సవాలు, గణపతి నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎస్సై వి. విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసినా, అధిక శబ్దంతో నిర్వహించినా సంబంధిత నిర్వాహకులు, డీజే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గణపతి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.