హైస్కూల్లో ఘనంగా ఇంజనీర్స్ డే
కాకతీయ హైస్కూల్లో ఘనంగా ఇంజనీర్స్ డే మన భారత్, చిట్యాల: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలంలోని కాకతీయ హైస్కూల్లో మంగళవారం ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ రంగంలో విశ్వేశ్వరయ్య అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజు మహమ్మద్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అనేది కేవలం భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణానికి మాత్రమే పరిమితమైన రంగం కాదని అన్నారు. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా...