మన భారత్,మొగుళ్ళపల్లి:
భూముల రి సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం, ఆకినపల్లి గ్రామంలో జరుగుతున్న రి సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న ఈ సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దుల స్థానానికి కచ్చితంగా గుర్తించి, వాటిని సంబంధిత భూ రికార్డులతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామస్తులు అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
