manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 11:10 pm Editor : Editor Vishal Kumar

హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి

హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి

-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్

మన భారత్,మొగుళ్ళపల్లి:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేస్తూ, ప్రచురించనున్నట్లు చెబుతున్న వివాదాస్పద పుస్తకాన్ని నిలుపుదల చేసి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొగుళ్ళపల్లి అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్అన్నారు.మంగళవారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ మొగులపల్లి మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం అటువంటి మహానీయుడిని అవమానించేలా, వ్యాఖ్యలు చేయడం ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తూ పుస్తకం ప్రచూరించేందుకు , అంబేద్కర్ పట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు భారత రాజ్యాంగం విలువలను అవమానించేలా హమారా ప్రసాద్ అనే వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, పుస్తక ప్రచురణ వ్యాప్తిని నిలుపుదల చేసి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సీనియర్ జిల్లా నాయకులు ముంద సాంబయ్య, బండారి రాజు, బండారి రమేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాత రాజు రమేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అంతడుపుల సారంగపాణి, మొగుళ్ళపల్లి అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్, వార్డు సభ్యుడు హర్షం మహేష్, గుడిమల్ల రమేష్ ,బండారి బాబు ,మంగళపల్లి సుదర్శన్ ,బండారి శంకర్, బండారి రమేష్ ,మొకిడి అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.