పూజల పేరుతో భయపెట్టి డబ్బుల వసూలు.. భార్యాభర్తల అరెస్ట్
బ్లాక్ మ్యాజిక్ పేరుతో ప్రాణహాని భయం.. పూజా సామగ్రి కోసం రూ.81,600 వసూలు మన భారత్, సెప్టెంబర్ 15, ఆదిలాబాద్: పూజలతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు. పూజల పేరుతో...