manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 9:21 pm Editor : manabharath

పూజకు మట్టి విగ్రహాలు మేలు: మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

నూతన మున్సిపల్ కార్యాలయం, వినాయక్ చౌక్ గోపాలకృష్ణ మఠం వద్ద ఉచితంగా విగ్రహాలు

మన భారత్, సెప్టెంబర్ 14,ఆదిలాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆదిలాబాద్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నగరంలోని నూతన మున్సిపల్ కార్యాలయం తో పాటు వినాయక్ చౌక్ గోపాలకృష్ణ మఠం ప్రధాన గేటు ఎదుట మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు.

పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేయడంతో భక్తులు, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

పర్యావరణహిత విగ్రహాలకు ప్రోత్సాహం

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి విగ్రహాలను ఉపయోగించడం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి