manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 10:18 pm Editor : manabharath

శిశుమందిర్‌లో ఘనంగా వినాయక పూజలు..

వినాయక్ చౌక్ శిశుమందిర్‌లో ఘనంగా వినాయక పూజలు

ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 14, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ శిశుమందిర్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శిశుమందిర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గణనాథునికి పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. అనంతరం ప్రజలు, భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలతో శిశుమందిర్ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు లచ్చన్నతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి