manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 11:14 pm Editor : manabharath

అంకిత ట్రెండ్ కలెక్షన్స్ ప్రారంభం..

ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 14, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకిత ట్రెండి కలెక్షన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా షాపులో అందుబాటులో ఉన్న వివిధ రకాల వస్త్రాలు, ఫ్యాషన్ కలెక్షన్స్‌ను పరిశీలించారు. నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నిర్వాహకులకు బోరంచు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

ఆదిలాబాద్ పట్టణంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. నూతన సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో వ్యాపార నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి