మొక్కల సంరక్షణలో వాచ్‌ర్ల పాత్ర కీలకం
వర్షంలోనూ విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి
మన భారత్, సెప్టెంబర్14, తలమడుగు మండల కేంద్రంలో నీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న మొక్కల పెంపకం కార్యక్రమాలు విజయవంతం కావడంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది, వాచ్‌ర్ల పాత్ర ఎంతో కీలకంగా మారుతోంది. మొక్కలు నాటడంతోనే బాధ్యత ముగియకుండా వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా పెంచేందుకు వాచ్‌ర్లు నిరంతరం శ్రమిస్తున్నారు.
బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండల కేంద్రానికి చెందిన ఎల్పుల అశోక్ అటవీశాఖలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను కాపాడుతూ వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, వాటి చుట్టూ పరిశుభ్రతను నిర్వహించడం, పశువులు, ఇతర జంతువుల నుంచి మొక్కలను రక్షించడం వంటి పనులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.
వర్షంలోనూ విధులకు హాజరు
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మొక్కల సంరక్షణ కోసం అశోక్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తన బాధ్యతను కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరాలంటే మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వాచ్‌ర్లు ఎండ, వానలను లెక్కచేయకుండా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి కనీస అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి
అటవీశాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం, జిల్లా అటవీశాఖ అధికారులు తగిన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో విధులు నిర్వహించే వారికి అవసరమైన రక్షణ సామగ్రి, ఇతర మౌలిక సదుపాయాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించి చెట్లుగా పెంచడం అంతకంటే ముఖ్యమని, ఈ ప్రక్రియలో వాచ్‌ర్లు చేస్తున్న సేవలను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం, సౌకర్యాలు అందించాలని కోరుతున్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
