manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 2:15 am Editor : manabharath

నిర్మల కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ..

గుండెపోటుతో మృతి చెందిన నిర్మల కుటుంబానికి రాథోడ్ బాపురావు పరామర్శ

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే

మన భారత్, సెప్టెంబర్ 14, తలమడుగు మండలం ఝారి గ్రామానికి చెందిన షేడ్మకి మారుతి సతీమణి క్రి.శే. నిర్మల కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఝారి గ్రామాన్ని సందర్శించి నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

గ్రామంలో పర్యటించిన రాథోడ్ బాపురావు నిర్మల స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిర్మల మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆప్తురాలిని కోల్పోయిన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

అనుకోని విధంగా కుటుంబ సభ్యురాలు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్న ఆయన, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నాయకులు, గ్రామ పెద్దల పరామర్శ

ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కన్వీనర్ నిమ్మల గజానంద్, గడుగు పాచ్చన్న, వినోద్, దేవుళ్ల స్వామి, నాయిని శ్రీనివాస్, దేవుళ్ల రమేష్, ప్రకాష్ తో పాటు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారూ.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి