manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:09 pm Editor : manabharath

ఆ కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

గాయపడిన మాజీ ఎంపీటీసీ సునీతకు రాథోడ్ బాపురావు పరామర్శ

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా

మన భారత్, సెప్టెంబర్ 14, తలమడుగు మండలంలోని బరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శాస్త్రి సతీమణి తిరునగిరి సునీత ఇటీవల ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో చేతికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాథోడ్ బాపురావు ఆమెను పరామర్శించారు.

బరాంపూర్ గ్రామంలోని సునీత నివాసానికి వెళ్లిన రాథోడ్ బాపురావు గాయపడిన సునీత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుతం అందుతున్న వైద్యం, చికిత్సకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సునీత త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని రాథోడ్ బాపురావు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అవసరమైన సమయంలో తనవంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా కల్పించారు.

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

ప్రజా జీవితంలో పనిచేసే కుటుంబాలతో తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, కష్టసమయంలో వారికి అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సునీత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు కుటుంబ సభ్యులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మండల కన్వీనర్ నిమ్మల గజానంద్ తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి