మన భారత్, చిట్యాల:
స్టార్ యూత్ యువకులకు అవగాహన కరపత్రాలు అందజేసిన వాణి విజ్ఞాన కేతన్ విద్యార్థులు
చిట్యాల, సెప్టెంబర్ 13: చిట్యాల మండలం రాంనగర్ కాలనీలోని వాణి విజ్ఞాన కేతన్ పాఠశాల చిన్నారులు పర్యావరణపరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మట్టి వినాయకుల ప్రత్యేకతను వివరిస్తూ, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ స్టార్ యూత్ యువకులకు అవగాహన కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని, చెరువులు, నదులు, కుంటలు కాలుష్యం కాకుండా కాపాడటంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని వివరించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులతో నష్టాలు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP)తో తయారు చేసిన వినాయక విగ్రహాలు నీటిలో త్వరగా కరగవని, జల కాలుష్యానికి కారణమవుతాయని విద్యార్థులు అవగాహన కల్పించారు. వీటి వల్ల చేపలు, ఇతర జలచరాల జీవనానికి ఇబ్బందులు కలగవచ్చని, రసాయన రంగులు నీటి వనరులకు, ప్రకృతికి హాని కలిగించే అవకాశం ఉందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు మనం చేయాల్సింది
మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
సహజ రంగులతో అలంకరించిన విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి.
ప్లాస్టిక్ అలంకరణలను తగ్గించాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి.
ఈ సందర్భంగా విద్యార్థులు “మట్టి వినాయకుడు ప్రకృతికి మిత్రుడు”, “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. ఈ కార్యక్రమంలో వాణి విజ్ఞాన కేతన్ పాఠశాల చిన్నారులు, స్టార్ యూత్ పాల్గొన్నారు..
జై గణేష్.. వినాయక చవితి శుభాకాంక్షలు!
మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
