ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..
నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 7 గంటల నుంచి పంపిణీ అదిలాబాద్, మన భారత్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ అదిలాబాద్ పట్టణంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు. పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేలా ప్రోత్సహించాలనే...