manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 11:57 pm Editor : Editor Vishal Kumar

రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపిన బీసీ నేత

అసెంబ్లీలో బీసీల డిమాండ్ కు అనుగుణంగా తీర్మానించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

-బీసీ సంక్షేమ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడి

మన భారత్,మొగుళ్ళపల్లి:

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణలో ఓబీసీ కాలమ్ చేర్చాలని తాము అడిగిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షనీయమని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిరిగానే దేశ వ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేపట్టాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మహేందర్ గౌడ్ ఈ సందర్భంగా అభినందించారు.

అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదనుకుంటే..తెలంగాణలోని బీజేపీ పార్టీకి కూడా బీసీ కులగణన చేయడం ఇష్టం లేదనే విషయం రాష్ట్ర అసెంబ్లీలో వారు వ్యవహరించిన తీరును బట్టి బీసీ సమాజానికి మొత్తం తెలిసిపోయిందన్నారు. అసెంబ్లీలో జరిగిన కులగణన చర్చలో పాల్గొనకుండా..బీసీ కులగణన తీర్మానానికి మద్దతు తెలుపకుండా అసెంబ్లీ నుండి వాక్ అవుట్ చేయడం అత్యంత దుర్మార్గమని, దీనితో బీజేపీ పార్టీ చరిత్రలో బీసీల ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

బీసీలకు మద్దతు ఇవ్వకుండా బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ నుండి బైకార్ట్ చేస్తే..రేపు వచ్చే ఎన్నికలలో బీజేపీకి బీసీలు ఓట్ల బైకాట్ చేస్తారని, ఈ విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. జనగణనలో ఓబీసీ కాలం చేర్చకుండా, ప్రతి కులానికి యూనిట్ కోడ్ ఇవ్వకుండా, రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానానికి మద్దతు ఇవ్వనందుకు నిరసన బీజేపీ పార్టీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన బీసీ సమాజానికి పిలుపునిచ్చారు.

రాష్ట్ర అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానానికి మద్దతు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకాటి శ్రీహరి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలకు వేముల మహేందర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.