గణేశ్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్
శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ఉత్సవాలు నిర్వహించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 13: భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై శాసన మండలి కాన్ఫరెన్స్...