manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:06 am Editor : manabharath

బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు..

గండ్ర సమక్షంలో బీఆర్ఎస్‌లోకి ఇప్పలపల్లి ఉప సర్పంచ్ సహా గ్రామ ప్రజలు….

-గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర..

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గురి తిరుపతి రావు ,అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ వినోద్ తో పాటు గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ , గండ్ర జ్యోతి సమక్షంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు గండు శ్రీనివాస్, ఆకుతోట వీరస్వామి పాల రమేష్, తోడేటి రాజు, భైరగాని బాపులు, గుర్రపు రాంబాబు, దూడపాక స్వామి, దూడపాక రఘుపతి, దూడపాక ప్రవీణ్, శ్రీపతి తిరుపతి, భైరగాని సతీష్, గడ్డం కుమార్,దూడపాక ఓదెలు, సరిగోమ్ముల రాజేందర్, గండు రాజీరు, గండు చంద్రమౌళి,తోడేటి అశోక్, సరిగోమ్ముల కుమార్, దూడపాక సమాధానం తదితరులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అనే భావన ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్‌తో పాటు పార్టీలో చేరిన పెద్దలందరికీ స్వాగతం తెలిపారు.ఇప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో పార్టీకి దూరమైన వారు, ప్రస్తుతం తటస్థంగా ఉన్నవారు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోందని అన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఇప్పలపల్లి నుంచి పార్టీలో చేరిన వారందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు.వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు గడ్డం రాజు, తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.