manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:23 pm Editor : manabharath

పురుగు మందు తాగి రైతు బలవన్మరణం..

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పర్ల గ్రామానికి చెందిన రైతు చుక్కబొట్ల మహేందర్ (45) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి వద్ద కలుపు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

రిమ్స్‌లో వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మహేందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాంసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.