చిట్యాలలో శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య 18వ వార్షిక మహాసభ
మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయంలో 18వ వార్షిక మహాసభను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు మండల పరిధిలోని అన్ని గ్రామ సమాఖ్యల అధ్యక్షురాళ్లు హాజరయ్యారు.
సంఘాల పనితీరు, గ్రామ సంఘాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, నాయకత్వ మార్పిడి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.అనంతరం మండల సమాఖ్య నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎండీ దర్గా, కార్యదర్శిగా పాసిగడ్డ నిర్మల, కోశాధికారిగా లతలను ఎంపిక చేశారు.
కార్యక్రమంలో MPDO జయశ్రీ, DPM వేణుగోపాల్రెడ్డి, శ్రీనిధి RM రమాకాంత్, అసిస్టెంట్ మేనేజర్ సుమన్, CC సాంబశివుడు, APM కోటేశ్వరరావుతో పాటు అన్ని గ్రామ సమాఖ్యల VOAలు పాల్గొన్నారు.
అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన VOAలకు MPDO జయశ్రీ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలను అందజేశారు.
మీ శీలపాక రాజు, మన భారత్, జర్నలిస్టు, చిట్యాల
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
