manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:49 pm Editor : Editor Vishal Kumar

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి..

గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి

-విద్యుత్ శాఖ ఏఈ గుగులోతు నగేష్

మన భారత్,మొగులపల్లి:

గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని మొగుళ్లపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈ గుగులోతు నగేష్ సూచించారు. ఈ సందర్భంగా గురువారం విద్యుత్ ఏఈ నగేష్ మాట్లాడారు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. వైరింగ్ పనులను లైసెన్సుడు ఎలక్ట్రీషియన్ తోనే చేయించాలని సూచించారు. సర్వీస్ కేబుల్ ను హుక్ చేయడం, వైర్లను నెల పై వేయడం చేయరాదని హెచ్చరించారు. ఇన్వర్టర్, జనరేటర్ వినియోగించే సమయంలో రిటర్న్ కరెంటు విద్యుత్ లైన్లలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తడిచేతులతో స్విచ్ లు, విద్యుత్ పరికరాలను తా కరాదని సూచించారు. విద్యుత్ సరఫరా ప్రారంభించే ముందు ఓ అండ్ ఎం ,సిబ్బందితో వైరింగ్ ను తనిఖీ చేయించుకోవాలని కోరారు. అత్యవసర సహాయం కొరకు మండలంలోని ప్రతి మండపం వద్ద ఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 తో పాటు సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని ఏఈ నగేష్ విద్యుత్ సిబ్బందికి ఆయన తెలిపారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.