manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:34 pm Editor : Editor Vishal Kumar

అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం..

ఆరెపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆరెపల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ సూపర్వైజర్
అరుణాదేవి అధ్వర్యంలో 9 వ పోషణ మాసం మన అంగన్వాడీ మన బాధ్యత ‘ అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి మాట్లాడుతూ, లబ్ధిదారులకు పోషకహారం, బాలామృతం , వైవిధ్య ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు తీసుకోవాలని అంటే రైస్ తో పాటు చిరుధాన్యాలు,పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని, ఆకుకూరలు, గుడ్లు,పాలు,చేపలుతీసుకోవాలని అవగాహన కల్పించారు,ముఖ్యం గా పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకూడదని, పిల్లలకు ఫోన్ చూపిస్తూ, భోజనం తినపెట్టకూడదు అని ,మా అంగన్వాడీ సెంటర్స్ లో ఇచ్చే భోజనం మెనూ గురించి ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ, వార్డు సభ్యులు రంపిస శ్రీనివాస్, వివో సభ్యురాలు ,ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఆశ, అంగనవాడి టీచర్స్, సప్న ,రజిత, వెన్నెల, కవిత , చిన్నారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.