manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 5:47 am Editor : manabharath

అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జననం

తలమడుగు: అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జననం

మన భారత్, సెప్టెంబర్11, తలమడుగు: పురిటినొప్పులతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది తల్లీబిడ్డకు అవసరమైన ప్రాథమిక వైద్య సహాయం అందించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.

తలమడుగు మండలంలోని ఝరి షేకు గూడకు చెందిన ప్రియాంకకు శుక్రవారం ఉదయం పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది ప్రియాంకను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ చేపట్టారు.

అయితే ఝరి గ్రామ సమీపానికి చేరుకునే సమయంలోనే ప్రియాంకకు ప్రసవం కావడంతో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ పైలెట్ గజనన్, ఈఎంటీ లీలేశ్వర్ వెంటనే అప్రమత్తమై ప్రసవ ప్రక్రియలో సహకరించి తల్లీబిడ్డకు అవసరమైన వైద్య సహాయం అందించారు.

అనంతరం తల్లీబిడ్డను మెరుగైన వైద్యం, వైద్యుల పర్యవేక్షణ కోసం తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి గర్భిణిని సురక్షితంగా తరలించడంతో పాటు అంబులెన్స్‌లోనే ప్రసవానికి సహకరించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో అత్యవసర సమయాల్లో 108 సేవల ప్రాధాన్యత మరోసారి వెల్లడైంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి