వైభవంగా పొలాల పండగ ఉత్సవాలు..
మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పొలాల పండగ ఉత్సవాలను ప్రజలు సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించారు. వ్యవసాయానికి, పశుసంపదకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే ఈ పండగను గ్రామీణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పొలాల పండగ సందర్భంగా ఉదయం నుంచే గ్రామాల్లో పండగ సందడి నెలకొంది. ప్రజలు ఉపవాస దీక్ష పాటించి తమ ఇళ్ల వద్ద ఉన్న బసవయ్యలను శుభ్రంగా కడిగి, అందంగా అలంకరించారు. అనంతరం బసవయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించి,...