manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:28 pm Editor : manabharath

మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష

మన భారత్, సెప్టెంబర్ 10, తలమడుగు: మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టు తీర్పు వెలువరించింది. తలమడుగు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవాపూర్ శివారు ప్రాంతంలో జరిగిన మోటార్‌సైకిల్ చోరీ ఘటనకు సంబంధించి సొలంకి భగత్ (19) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.

కేసును విచారించిన ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎస్. తేజస్విని నిందితుడు సొలంకి భగత్‌కు 9 నెలల 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. చోరీ ఘటనపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో ఎస్ఐ డి. రాధిక సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి, నిందితుడిపై ఆధారాలను సేకరించిన అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.

మోటార్‌సైకిల్ చోరీలు, ఇతర నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కేసు దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ఐ రాధికతో పాటు తలమడుగు పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. నేరాల నియంత్రణలో పోలీసుల దర్యాప్తు కీలకమని, నిందితులకు శిక్ష పడేలా ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.