manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 10:57 pm Editor : manabharath

డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: ఎస్సై రాధిక

మన భారత్, సెప్టెంబర్ 9, తలమడుగు:
తలమడుగు మండలంలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని ఎస్సై రాధిక సూచించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో గురువారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు, నిబంధనలను వివరించారు.

ప్రతి గణేశ్ మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఎస్సై రాధిక స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో పోలీసుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ముఖ్యంగా అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే డీజేలకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు.

గణేశ్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. మండపాల వద్ద భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉత్సవాల సమయంలో ఏదైనా సమస్య, వివాదం లేదా అవాంఛనీయ పరిస్థితి తలెత్తితే నిర్వాహకులు స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రాధిక కోరారు. పోలీసులకు సహకరిస్తూ గణేశ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

ఈ సమావేశంలో ఎస్సై రాధికతో పాటు పోలీసు అధికారులు, గణేశ్ మండపాల నిర్వాహకులు, పీస్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.