విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
విద్యా ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరం: DIEO జాదవ్ గణేశ్ కుమార్ తలమడుగు,మన భారత్ ,సెప్టెంబర్ 9: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేశ్‌కుమార్ సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా అవగాహన కల్పించడంతో పాటు, వారి విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. మంగళవారం DIEO జాదవ్ గణేశ్‌కుమార్ తాంసి, తలమడుగు ప్రభుత్వ జూనియర్...