manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 11:47 pm Editor : manabharath

కోసాయి హనుమాన్ ఆలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు..

ఆలయ విశిష్టతను వివరించిన సర్పంచ్ శైలజ రవి.. పోలీసు అధికారులకు ఘన సన్మానం

మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 8:
తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలో ఉన్న శ్రీ హనుమాన్ ఆలయాన్ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఉమ్రి గ్రామానికి వచ్చిన ఎస్పీ అనంతరం కోసాయిలోని హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు.

ఆలయానికి చేరుకున్న జిల్లా ఎస్పీకి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజల సుఖసంతోషాలు, గ్రామాభివృద్ధి, శాంతిభద్రతలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు.

ఆలయ ప్రత్యేకతను వివరించిన సర్పంచ్

ఈ సందర్భంగా కోసాయి గ్రామ సర్పంచ్ శైలజ రవి హనుమాన్ ఆలయానికి ఉన్న ప్రత్యేకత, ఆలయ చరిత్ర, గ్రామ ప్రజలకు ఆలయంతో ఉన్న అనుబంధం గురించి జిల్లా ఎస్పీకి వివరించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఆలయ ప్రాధాన్యతను తెలియజేశారు.

అనంతరం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు. పోలీసు శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలను గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, తలమడుగు ఎస్ఐ డి. రాధిక, కోసాయి గ్రామ సర్పంచ్ శైలజ రవి, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆలయాన్ని సందర్శించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.