manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:30 pm Editor : Editor Vishal Kumar

తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

మన భారత్,మొగుళ్ళపల్లి:

శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతను అవమానించిన తాత మధు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు , యార రవికుమార్ డిమాండ్ చేశారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా ‘ఎవడ్రా’, ‘స్పీకర్ గాడు’ అంటూ ఏకవచనంతో సంబోధించడమే కాకుండా, ‘అధికారం ఇచ్చిన వాడు ఎవడ్రా’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో బూతులు తిట్టడం బీఆర్‌ఎస్ నేతల అహంకారానికి, దళిత వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.

దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన తాతా మధును తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండ రవి పోలినేని లింగారావు, నీల రాజు కురుమ, మెరుగు సురేష్ గౌడ్ యార ముకుంద రెడ్డి, క్యాతరాజు రమేష్, చిలుకూరి దేవేందర్ రెడ్డి గజ్జి రాజకుమార్ ,మంగళపల్లి శ్రీనివాస్ ,మంద సాంబయ్య నిమ్మతి రాజేందర్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.