గణేష్ ఉత్సవాల్లో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
–మొగుళ్ళపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్
మన భారత్,మొగుళ్ళపల్లి:
రానున్న గణేష్ ఉత్సవాల్లో సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి ఎస్ ఐ,ముప్పు సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ, పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, మొగుళ్లపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని లింకులు ,క్యూఆర్ కోడ్ లు, ఫోన్ కాల్స్ సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇతరులకు పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని సూచించారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
