manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:17 pm Editor : Editor Vishal Kumar

వినాయక చవితి కమిటీ అధ్యక్షుడిగా చిలువేరు పున్నం

ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి కమిటీ ఎన్నిక

మన భారత్,మొగుళ్ళపల్లి:

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ యువజన సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ,అధికార ప్రతినిధి నీరటి మహేందర్, ఆధ్వర్యంలో వినాయక చవితి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముదిరాజ్ యువజన సంఘం జెండాను ఆవిష్కరించారు. వినాయక చవితి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా చిలువేరు పున్నం, ప్రధాన కార్యదర్శిగా దేవునూరి మధులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గుడిమల్ల రమేష్, ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ,పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.