రాజకీయ శిక్షణ తరగతులతో కార్యకర్తలకు దిశానిర్దేశం..
నాగర్కర్నూల్ మన భారత్: సీపీఎం నాగర్కర్నూల్ మండల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల రామయ్య మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సమాజంలో చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ, వాటి పరిష్కారం కోసం ప్రజలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో పార్టీ కార్యకర్తల పాత్ర కీలకమని...