దేవాపూర్‌లో తౌడా దేవరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. కుటుంబ సభ్యులను ఓదార్చిన రాథోడ్ బాపురావు
మన భారత్, సెప్టెంబర్ 4 తలమడుగు: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన తౌడా దేవరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ స్టేట్ అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు.
మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దేవాపూర్‌లోని తౌడా దేవరెడ్డి స్వగృహానికి వెళ్లారు. అక్కడ మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తౌడా దేవరెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు.
మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే పరామర్శకు వచ్చిన సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానికులు ఆయనను కలిసి కుటుంబ పరిస్థితులను వివరించారు. తౌడా దేవరెడ్డి మృతిపట్ల గ్రామస్తులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మండల్ కన్వీనర్ నిమ్మల గజానంద్, స్వామి, శ్రీను, ప్రకాష్, అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి .
