manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 11:36 pm Editor : manabharath

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: రాథోడ్ బాపురావు

దర్బార్ స్ట్రీట్ హౌస్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: రాథోడ్ బాపురావు

మన భారత్, సెప్టెంబర్ 4,
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన దర్బార్ స్ట్రీట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. బోథ్ నియోజకవర్గం తలమడుగు మండలం జారి (పున్నాగూడ) గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నారాయణ కుమారుడు ఈ స్ట్రీట్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై స్ట్రీట్ హౌస్‌ను ప్రారంభించారు.

ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాథోడ్ బాపురావు రిబ్బన్ కట్ చేసి వ్యాపార కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

నాణ్యతతో వినియోగదారుల ఆదరణ పొందాలి

అనంతరం రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న నిర్వాహకులు వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ఆహార వ్యాపారంలో నాణ్యత, రుచి, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

దర్బార్ స్ట్రీట్ హౌస్‌లో ప్రజలకు నాణ్యమైన స్వీట్లు, రుచికరమైన తినుబండారాలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించేందుకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మంచి సేవలు అందించడం ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రజల ఆదరణ, నిర్వాహకుల కృషితో దర్బార్ స్ట్రీట్ హౌస్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆకాంక్షించారు. స్థానికంగా కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహం లభించడం ద్వారా యువతకు, వ్యాపార రంగంలోకి వస్తున్న వారికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్బార్ స్ట్రీట్ హౌస్ యజమాని జారి (పున్నాగూడ) నారాయణ, కార్తికేయ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుమలత, స్థానికులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభమైన దర్బార్ స్ట్రీట్ హౌస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి .