manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 10:42 pm Editor : Editor Vishal Kumar

బీసీ మహిళా మంత్రిని బర్తరఫ్ చేసి అవమానిస్తావా..!

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖమ్మను బర్తరఫ్ చేసి అవమానిస్తావా..!

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పిస్తామని హామీనిచ్చి..బీసీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..బీసీలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మారి..బీసీలను రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నాడని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్షాబంధన్ రోజున కొండా సురేఖమ్మ రాఖీ కట్టిన పుణ్యానికి..సోదరీకి ఆపదొస్తే అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖమ్మను బర్తరఫ్ చేసి, అవమానించి ఆ పాపం మూటగట్టుకున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలను అవమానించడమే సామాజిక న్యాయంగా పెట్టుకున్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొండా సురేఖమ్మ బిడ్డ సుస్మితా పటేల్ ప్రశ్నిస్తే..తల్లి సురేఖమ్మను ఏలా బర్తరఫ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి తెలపాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ మహిళను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మహిళాలోకం, బీసీ సమాజమంతా ఏకమై తిరుగుబావుటా ఎగురవేయాలన్నారు. బీసీలు వర్సెస్ అగ్రవర్ణాలుగా పోరాడి బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసుకోవాలన్నారు. బర్తరఫ్ చేయాలంటే సురేఖమ్మకు ఇచ్చిన మంత్రి శాఖలో అవినీతి చేయడం, అక్రమాలకు పాల్పడడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలకు పాల్పడితే బర్తరఫ్ చేయాలే కానీ..ముఖ్యమంత్రిని కొండా ఫ్యామిలీ ప్రశ్నించినందుకు బర్తరఫ్ చేస్తారా..? ఇది రేవంత్ రాజ్యాంగమా? అని మహేందర్ గౌడ్ ప్రశ్నించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.