manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 12:20 pm Editor : Editor Vishal Kumar

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

– కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మన భారత్,మొగుళ్ళపల్లి:

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక, ప్రజల్లో తమ ఉనికిని చాటుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2 నుండి సమరభేరి పేరుతో డ్రామాలాడుతోందని ,మొగుళ్ళపల్లి మండల5కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తున్న ఆరు గ్యారెంటీల విమర్శలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు:*
10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను రూ. 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని, కాళేశ్వరం పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఆరోపించారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేయని వారు, దళిత బంధును ప్రతి నియోజకవర్గంలో 100 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న వారు, నేడు కాంగ్రెస్ ను ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతలు:
అప్పులతో ఖాళీ అయిన ఖజానాను చక్కదిద్దుకుంటూనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని ఆయన వివరించారు.

1. మహాలక్ష్మి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు రూ.3000 ఆదా అవుతోంది, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.

2.గృహజ్యోతి: 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట.

3. రైతు భరోసా & రుణమాఫీ: రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతన్నను రుణ విముక్తుడిని చేసిన ఏకైక ప్రభుత్వం మనదే.

4. యువతకు ఉద్యోగాలు: గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇవ్వని ఉద్యోగాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 60 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. మెగా DSC తో 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసింది.

5. ఇందిరమ్మ ఇళ్లు: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

సమరభేరి కాదు, ఉనికి కోసం పోరాటం:
సెప్టెంబర్ 2 నుండి బీఆర్ఎస్ చేసే సమరభేరి ప్రజల కోసం కాదని, కేసీఆర్ కుటుంబ పాలనను, వారి అవినీతిని కాపాడుకోవడం కోసమేనని మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ఎద్దేవా చేశారు. భూపాలపల్లి ప్రజలు గత ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

మీ పవన్ కల్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.