కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు గడువు సోమవారంతో ముగియాల్సి ఉంది. అయితే ఇంకా పలువురు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం...