ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..
గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు ఆదిలాబాద్, ఆగస్టు 31: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు పోలీసు శాఖ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో...