manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 10:03 pm Editor : manabharath

యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్ వెంకన్న ..

కుచులాపూర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను విద్యార్థులకు అందజేసిన సర్పంచ్ మోడెపు వెంకన్న

తలమడుగు:మన భారత్ , ఆగస్టు,31, తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుచులాపూర్ గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న, ఉప సర్పంచ్ రాగి నిలబాయి దీపక్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు. ప్రభుత్వం విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా యూనిఫామ్‌లను అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా విద్యపై మరింత ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు. యూనిఫామ్‌ల పంపిణీతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. పాఠశాలకు యూనిఫామ్‌తో రావడం వల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన, క్రమశిక్షణ పెంపొందుతుందని వారు పేర్కొన్నారు.

విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలని గ్రామ పెద్దలు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.