manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 8:40 am Editor : manabharath

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..!

పామ్ ఆయిల్ తోటలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. సురక్షిత దూరానికి మార్చాలని వినతి

మన భారత్,మొగుళ్ళపల్లి:

వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ చెట్లకు అత్యంత దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలను సురక్షిత దూరానికి మార్చాలని కోరుతూ రామ్‌నగర్ కాలనీకి చెందిన శీలపాక సరోజన, శీలపాక రాజు చిట్యాల విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు. చిట్యాల గ్రామ పరిధిలోని హెచ్‌పీ గ్యాస్ గోదాం ఎదుట సర్వే నంబర్లు 5/1, 5/2లో మొత్తం 4 ఎకరాల 4 గుంటల వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నామని తెలిపారు.

విద్యుత్ తీగలు చెట్లకు దగ్గరగా ఉండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నదని, ఇటీవల శీలపాక నర్సయ్యకు విద్యుత్ షాక్ తగిలిన ఘటన కూడా జరిగిందని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు.మూడు నెలల క్రితం గాలులకు విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా, ప్రస్తుతం మరమ్మతు పనుల్లో భాగంగా ఐదు కొత్త స్తంభాలు, పాత సర్వీస్ వైర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

అవసరమైతే అదనపు స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసేందుకు అయ్యే ఖర్చును తామే భరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విద్యుత్ లైన్‌ను పామ్ ఆయిల్ చెట్లు, వ్యవసాయ పనులు చేసే వారికి ప్రమాదం కలగకుండా సురక్షిత దూరానికి అత్యవసరంగా మార్చాలని వారు కోరారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..