manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 10:10 pm Editor : Editor Vishal Kumar

ఘనంగా సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు..

తలమడుగు, ఆగస్టు 30: తలమడుగు మండల కేంద్రంలో శ్రీ సద్గురు సాయి బాబా పల్లకి ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాయి దీక్షాపరులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లకి సేవను విజయవంతం చేశారు.

సాయి బాబా పల్లకిని పూలతో అందంగా అలంకరించి ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు. సాయి బ్యాండ్ మేళాల నడుమ భక్తులు సాయిబాబా నామస్మరణ చేస్తూ, భజనలు మరియు భక్తి గీతాలు ఆలపిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.

ఈ సందర్భంగా సాయి దీక్షాపరులు మాట్లాడుతూ సాయి బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని సాయినాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించినట్లు తెలిపారు.

పల్లకి ఊరేగింపు సాగిన ప్రధాన వీధుల్లో భక్తుల సందడి నెలకొంది. మహిళలు, యువత, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. సాయి బాబా నామస్మరణతో తలమడుగు మండల కేంద్రం మార్మోగింది.

సాయి పల్లకి ఊరేగింపులో పాల్గొన్న భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రతి సంవత్సరం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..